మహిళా బిల్లు విషయంలో మోదీ సర్కార్‌ది కుట్ర: డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడానికి బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా బిల్లు చట్టం ముసుగులో 131 సవరణలతో డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ చట్టం తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ అసలు లక్ష్యమని ఆయన ఆరోపించారు. కులగణన చేయకుండా డీలిమిటేషన్ చట్టాన్ని ఎలా తీసుకువస్తారని ఆయన ప్రశ్నించారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదని, మోదీ మరియు బీజేపీ నాయకులు మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు కల్పించిందని, మహిళలను దేశ ప్రధానిగా, రాష్ట్రపతిగా, లోక్ సభ స్పీకర్‌గా గౌరవించిందని గుర్తుచేశారు. నిజంగా మోదీకి చిత్తశుద్ధి ఉంటే, కేవలం మహిళా రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని తీసుకురావాలి. డెలిమిటేషన్‌తో ముడిపెడితే కాంగ్రెస్ పార్టీ సహకరించదాని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజ రెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.