జైనథ్ బస్ స్టాండ్ ఆవరణలో చలివేంద్రం ప్రారంభం
జైనథ్ బస్ స్టాండ్ ఆవరణలో చలివేంద్రం ప్రారంభం చిత్రం న్యూస్, జైనథ్: పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికులు, బాటసారుల దాహార్తిని తీర్చడానికి జైనథ్ గ్రామ పంచాయతీ ప్రత్యేక చొరవ తీసుకుంది. స్థానిక బస్ స్టాండ్ ఆవరణలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఈరోజు ఘనంగా ప్రారంభించారు. వేసవి తాపం నుండి ప్రజలకు ఉపశమనం కలిగించడమే ధ్యేయంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పంచాయతీ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుండి...