Chitram news
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 9:19 pm Editor : Chitram news

వైట్ కాలర్ నేరాల నివారణకు చర్యలు తీసుకోవాలి

అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిక్కచ్చిగా నిర్వహించాలి

*నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : జిల్లాలో పెరుగుతున్న వైట్ కాలర్ నేరాలపై పత్యేక బృందాల ఏర్పాటు చేయాలని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని, ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసుల పురోగతి పై సమగ్ర సమీక్ష సమావేశం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న అరెవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిక్కచ్చిగా నిర్వహించాలని ఆదేశించారు. ఎక్కువకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను పాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పత్యేక దృష్టిపెట్టాలని ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో బాక్ స్పాట్లను గుర్తించి, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరగకుండా పత్రి రోజు మీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని, ఓవర్ స్పీడ్, త్రిబుల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై పత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో రోడ్డు భద్రత నిబంధనల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి.బస్వా రెడ్డి నిజామాబాద్ ఇన్ చార్జి ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి సీటీసీ ఏసీపీ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సీసీఆర్బీ సీఐ అంజయ్య, సీఐలు, ఎస్ఐలు, ఐటీ కోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.