వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పీడీ యాక్ట్
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పీడీ యాక్ట్ చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలో వరుస దొంగతనాలు, మొబైల్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న సయ్యద్ నవీద్ అలీ (అలియాస్ బడా ముష్రఫ్) పై ఆదిలాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. నిందితుడిపై ఇప్పటివరకు మొత్తం 23 కేసులు నమోదయ్యాయి. ఇందులో 20 దొంగతనం కేసులు కాగా, 3 గంజాయి స్మగ్లింగ్‌కు సంబంధించిన కేసులు ఉన్నాయి. గతంలో జైలు శిక్ష అనుభవించినప్పటికీ, నవీద్ అలీ తన ప్రవర్తన...