కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన మోహన్ రావు పాటిల్
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన జాదవ్ సావిత్రి బాయి భర్త బాబురావు ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పాటిల్ ఆ కుటుంబానికి అండగా నిలిచారు. నిత్యవసరాల నిమిత్తం కొంత ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఆయన మాట్లాడుతూ పల్లె పల్లెకు.. గడప గడపకు మోహన్ రావు పటేల్ కార్యక్రమం విజయవంతం చేయడంలో జాదవ్ సావిత్రి బాయి కుమారుడు గణేష్ కృషి ఉందన్నారు. మా ప్రజా ట్రస్ట్ పేద, మధ్య తరగతి కుటుంబాలకు సహాయపడటంలో ముందు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.