చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిర్సన్న గ్రామ సమీపంలో 353బీ జాతీయ రహదారిపై అతివేగంగా వస్తున్న ఓ లారీ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును బలంగా సోమవారం ఢీకొట్టింది. వేగంగా వస్తున్న లారీ రోడ్డు పక్కన ఉన్న కల్వర్టు గోడను ఢీకొనడంతో లారీ ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం లేదా అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ దెబ్బతిన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది.