హేటి గ్రామంలో వైభవంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
హేటి గ్రామంలో వైభవంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన చిత్రం న్యూస్, బేల: మండలంలోని బాధి గ్రామపంచాయతీ పరిధిలోని హేటి గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. గ్రామ పటేల్ మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచే వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దంతేలా...