Chitram news
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 5:22 pm Editor : Chitram news

ఇంటర్ ఫలితాల్లో లింగాపూర్ విద్యార్థుల ప్రతిభ

చిత్రం న్యూస్, దండేపల్లి: దండేపల్లి మండలం లింగాపూర్‌లోని తెలంగాణ మోడల్ స్కూల్ (TGMS) విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచారు. పాఠశాల విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఔరా అనిపించారు. MPC మొదటి సంవత్సరం విభాగంలో ఆర్.అక్షిత్ వర్మ 425/470 మార్కులు, పి.స్పందన 412 మార్కులు సాధించారు. BPC విభాగంలో ఎం.డి. ఆసియా అంజుం 399/440, జి.మదన్ చంద్ర 352 మార్కులతో మంచి ఫలితాలు సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బి.రాజ్ కుమార్ 969/1000, జి. సౌజన్య 956 మార్కులు సాధించగా, బి. సహితి 980 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ చూపింది. కె. వర్షిణి 890, వి.అపూర్వ శ్రీ 856, ఏ.హారిక 614 మార్కులు సాధించారు.