చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో శనివారం జరిగిన మహాత్మా జ్యోతిబా ఫులే 200వ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష పాల్గొన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన ఆటపాటలు ఆహ్వానితులను అలరించాయి. సుకుమార్ పెట్కూలే రచించిన ఫులే జీవిత చరిత్ర ఆడియో సీడీని కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే ఆవిష్కరించారు. వివిధ పాఠశాలల విద్యార్థులకు ఫులే జీవిత చరిత్రపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విజేతలకు మెమెంటో, ప్రశంసా పత్రాలను కలెక్టర్, ఎమ్మెల్యే అందజేశారు.బీసీ సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో, భుక్తాపూర్‌లోని ఫులే కూడలిలో, దస్నాపూర్‌లోని బీసీ స్టడీ సర్కిల్ ఆవరణలో ఫులే చిత్రపటాలకు, విగ్రహాలకు కలెక్టర్, మున్సిపల్ చైర్‌పర్సన్, అధికారులు, కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.