కారుణ్య నియామక అభ్యర్థులకు ఉత్తర్వులు అందజేసిన కలెక్టర్ రాజర్షి షా
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలో కారుణ్య నియామకాల కింద ఎంపికైన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా నియామక ఉత్తర్వును శనివారం అందజేశారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు ఎంపికైన మొత్తం 16 మంది అభ్యర్థులకు ఆయన ఈ ఉత్తర్వులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు....