డీసీసీ కార్యాలయంలో ఘనంగా ఫులే జయంతి: పాల్గొన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్ టౌన్: అణగారిన వర్గాల కోసం కృషి చేసిన మహనీయులు, గొప్ప సంఘసంస్కర్త, మహాత్మా జ్యోతిరావు ఫులే అని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఫులే జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ(డీసీసీ) కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కుల వివక్షకు వ్యతిరేకంగా, అణగారిన వర్గాల, మహిళల...