Chitram news
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 9:16 am Editor : Chitram news

విద్యార్థులకు సమ్మర్ ఇంటర్న్‌షిప్ శిక్షణ పూర్తి 

చిత్రం న్యూస్, దండేపల్లి :మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని TGMS లింగాపూర్ విద్యార్థులకు, Media and entertainment విభాగం లో ప్రయోగ పూర్వక జ్ఞానాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు వృత్తి విద్యలో భాగంగా ఆచరణాత్మక అనుభవం కల్పించేందుకు వృత్తి విద్య శిక్షకుడు రాజు రెడ్డి పర్యవేక్షణలో ఈ శిక్షణ కార్యక్రమం మార్చి 30 నుంచి ఏప్రిల్ 10 వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి ప్రణవి ఫోటో స్టూడియో మ్యాదరిపేట లో విద్యార్థులు ఆసక్తిగా శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్.రమెష్ మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్తులో వివిధ రంగాలలో ఎదగడానికి ఈ తరహా ఇంటర్న్‌షిప్‌లు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ముఖ్యంగా వృత్తి విద్య ద్వారా విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుందని ఆయన అన్నారు. విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ తమ నైపుణ్యాలను పెంపొందించుకున్నారు. ఈ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని సాయి ప్రణవి ఫోటో స్టూడియో నిర్వాహకులు మైదం రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.