Chitram news
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 9:51 pm Editor : Chitram news

కందకుర్తికి ఆర్ఎస్ఎస్ చీఫ్: బందోబస్తు ఏర్పాటును పర్యవేక్షించిన పోలీసు కమిషనర్

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : ఏప్రిల్ 11న కందకుర్తిలో శ్రీ కేశవ స్ఫూర్తి మందిర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డా. మోహన్ భాగవత్ సర్ సంఘ్ చాలాక్ (ఆర్.ఎస్.ఎస్ చీఫ్) విచ్చేస్తున్న సందర్భంగా సభ స్థలము, విగ్రహ ప్రతిష్టాపన, బహిరంగ సభ తదితర ప్రదేశాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అన్ని ప్రదేశాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని సభ స్థలంలో పటిష్ట భాగం బందోబస్తు,  కేంద్ర పార మిలటరీ, రాష్ట్రస్థాయి బలగాలు, 6 క్యూఆర్టీ,  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని , ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు కలవకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 400 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ శ్రీనివాస్ , బోధన్ రూరల్ సీఐ శ్రీ విజయబాబు , రెంజల్ ఎస్సై చంద్రమోహన్ , బోధన్ రూరల్ ఎస్సై మచ్చందర్ రెడ్డి , ఎడపల్లి ఎస్సై రమ, కేశవనంద భారతి ట్రస్ట్ ప్రెసిడెంట్ చామకూరి సుధాకర్ రెడ్డి , ప్రచారక్ శివకుమార్ తెలంగాణ ప్రచారక సహకార, మల్లికార్జున్ కేశవ్ నంద భారతి మెంబర్ సుబోర్ కాకాని తదితరులు పాల్గొన్నారు.