పెర్కిట్ మహిళా ప్రాంగణం ఉదంతంపై కలెక్టర్ సీరియస్
*బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: పెర్కిట్ మహిళా ప్రాంగణంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనను కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా పరిగణిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ పి.ఇందిర శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ను కలిసి జరిగిన సంఘటన గురించి తెలియజేశారు. గత మార్చి నెల 02 వ తేదీ నుండి 31వ తేదీ వరకు బ్యూటిషియన్ కోర్సులో బాలికలు, యువతులకు మహిళా...