Chitram news
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 9:26 pm Editor : Chitram news

నిజామాబాద్ లో మెగా ప్రీమియర్ లీగ్ పోటీలు

నిజామాబాద్ లో మెగా ప్రీమియర్ లీగ్ పోటీలు

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో “నిజామాబాద్ ప్రీమియర్ లీగ్” జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన క్రీడా పోటీల గురించి వివరించారు.

ఈ క్రీడా పోటీల ద్వారా ముఖ్యంగా యువకులకు, ప్రజలకు సైబర్ సెక్యూరిటీ, మాదక ద్రవ్యాల నిర్మూలన ట్రాఫిక్ నిబంధనల పట్ల విస్తృత అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని సీపీ వెల్లడించారు. ఈ మెగా టోర్నమెంట్ నిర్వహణ కోసం సాయి చైతన్య ఎన్ ఎస్ సి చైర్మన్ గా, బస్వ రెడ్డి ఎన్ఎస్ సీ కన్వీనర్ గా, కవిత రెడ్డి ఎన్ఎస్ సీ జనరల్ సెక్రటరీగా ఆర్గనైజింగ్ కమిటీ పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కమిటీలో జాయింట్ సెక్రటరీలుగా కే. శ్రీనివాస్ రెడ్డి (స్పోర్ట్స్), డా. కే. శిరీష్ కుమార్ (సైబర్ సెక్యూరిటీ), రజినీకాంత్ (ఫిజికల్ సెక్యూరిటీ) ట్రెజరర్ గా కే. సంతోష్ కుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రీడా పోటీలలో భాగంగా మొత్తం ఐదు రకాల ఆటల పోటీలు వాలీబాల్,  బాస్కెట్ బాల్, కబడ్డీ, యోగా, క్రికెట్ నిర్వహిస్తున్నారు.

వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ పోటీలు నిజామాబాద్ లోని డీఎస్ఏ మైదానంలో జరగనున్నాయి. ఈ మూడు విభాగాలలో విజేతలకు మొదటి బహుమతిగా రూ.20 వేలు, రెండవ బహుమతిగా రూ.10 velu, మూడవ బహుమతిగా రూ.5 వేలు అందజేయనున్నారు. కబడ్డీ పోటీలు కేవలం పురుషులకు మాత్రమే నిర్వహించనున్నారు.

యోగా పోటీలు సుభాష్ నగర్ లోని కాకతీయ ఒలంపియాడ్ స్కూల్లో నిర్వహించనున్నారు. ఇందులో అండర్-14, అండర్-18, 18 ఏళ్లు పైబడిన బాలబాలికలకు మొత్తం 6 క్యాటగిరీలలో 18 బహుమతులు ఉంటాయి. యోగా విభాగంలో విజేతలకు మొదటి బహుమతిగా రూ.3 వేలు, రెండవ బహుమతిగా రూ.2 వేలు, మూడవ బహుమతిగా రూ.వేయి అందజేయనున్నారు.

క్రికెట్ పోటీలు కంటేశ్వర్ లోని మహిళా డిగ్రీ కళాశాల మైదానంలో 12 ఓవర్ల ఫార్మాట్లో హార్డ్ టెన్నిస్ బంతి తో నిర్వహించనున్నారు. క్రికెట్ ఎంట్రీ ఫీజు రూ. 5 వేల కాగా కేవలం మొదట నమోదు చేసుకున్న టీములకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. క్రికెట్ విజేతలకు భారీ స్థాయిలో మొదటి బహుమతి రూ.లక్ష , రన్నరప్ కు రూ.50 వేలు నగదు బహుమతి ప్రకటించారు. క్రికెట్ క్రీడాకారులు సొంతంగా తెలుపు ప్యాంట్, తెలుపు బూట్లు తెచ్చుకోవాలన్నారు.

ఈ పోటీల్లో పాల్గొనదలచిన వారు ఈ నెల 11 నుండి  17 వరకు సాయంత్రం 5:00 గంటల లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. పోటీలకు సంబంధించిన డ్రా ఈనెల 18వ తేదీన మధ్యాహ్నం 2:00 గంటలకు తీయబడునన్నారు. ఈ టోర్నమెంట్ కేవలం నిజామాబాద్ జిల్లా వాసులకు మాత్రమే అవకాశం ఉండటంతో, క్రీడాకారులు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ వెంట తీసుకురావాలన్నారు. యోగా పోటీదారులు వయస్సు ధృవీకరణ కోసం స్కూల్ బోనఫైడ్ లేదా ఎస్ఎస్సీ మెమో సమర్పించాల్సి ఉంటుందన్నారు. టోర్నమెంట్ సమన్వయకర్తలుగా జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ బి. పవన్ కుమార్ (9701177144), కబడ్డీ కోచ్ ప్రశాంత్ బాధ్యతలు చేపట్టారు. జిల్లాలోని క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.

ఆటల్లో పేరు నమోదు చేసుకునేందుకు వాలీబాల్ – బి. మల్లేష్ గౌడ్ (9440711635), బాస్కెట్ బాల్ బి.నరేష్ (9440404424), కబడ్డీ ఎం.ప్రశాంత్ (9866770889), యోగా సంగీత (9848420803), గంగాధర్ (8074982200), క్రికెట్ – సురేష్ కుమార్-(9849202586) విక్రమ్ (9493309972) లను సంప్రదించాలన్నారు.