ఆన్లైన్ బూస్టర్ సిస్టమ్ పనితీరును పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: మారుమూల నివాస ప్రాంతాలకు సైతం రక్షిత మంచి నీటిని అందించేందుకు వీలుగా ఎడపల్లి మండలం జానకంపేట వద్ద ఏర్పాటు చేసిన ఆన్లైన్ బూస్టర్ సిస్టమ్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం సందర్శించారు. దీని పనితీరు, ప్రయోజనాల గురించి గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిట్టచివరన ఉండే ఆవాసాలకు కూడా తాగునీరు చేరుకునేందుకు ఈ విధానం దోహదపడుతుందని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతగిరి, పోచారం గ్రామాలకు...