బేలలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శిక్షణ తరగతులు: పాల్గొన్న ఎంపీ గొడాం నగేష్
చిత్రం న్యూస్, బేల: భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శిక్షణ తరగతులు శుక్రవారం బేల మండల కేంద్రంలోని శ్రీరామ్ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ ఎంపీ గొడాం నగేష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పార్టీ సిద్ధాంతాలు, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ శిక్షణ తరగతులలో జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కట్కం రాందాస్ , జిల్లా ప్రధాన కార్యదర్శులు విజయ్, క్రాంతి కుమార్ జైనథ్, బేల, భోరజ్, సాత్నాల మండలాల అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్ ఛార్జిలు, మండల పదాధికారులు, బూత్ కమిటీ అధ్యక్షులు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం రాబోయే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ శిక్షణ సాగింది.
