Chitram news
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 2:20 pm Editor : Chitram news

ఉపాధి హామీ పనులను సందర్శించిన ఉప సర్పంచ్ టాక్రే సాగర్

ఉపాధి హామీ పనులను సందర్శించిన ఉప సర్పంచ్ టాక్రే సాగర్

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చప్రాల గ్రామంలో ఉపాధి హామీ పనులను  ఉప సర్పంచ్ టాక్రే సాగర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న కూలీల దగ్గరికి వెళ్లి కూలీలు ఎండలో పనిచేస్తున్న వారికి ఓ ఆర్ ఎస్ పాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ టాక్రే సాగర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన భువన్ యాప్ కూలీలకు చాలా ఇబ్బంది పెడుతుందన్నారు. ఉదయం ఫొటో క్యాప్చర్ చేస్తేనే పనులకు వెళ్ళవచ్చాన్నారు. క్యాప్చర్ కాని వారు పనిచేయరాదనీ, ఆ కూలీల పరిస్థితి ఎలా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం వరకు కూలీలు ఫొటో క్యాప్చర్ కోసం వేచివుండాల్సి వస్తుందన్నారు. ఇంత సమయం తీసుకుంటే ఇంటి నుండి భోజనం చేయక వచ్చిన కూలీల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. పాతపద్దతిలో మాస్టర్ రోల్ పేపర్ పైన సంతకాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. సర్పంచ్ మెస్రం దౌలత్, సెక్రటరీ అర్షద్, ఫీల్డ్ అసిస్టెంట్ దేవరావు తదితరులు పాల్గొన్నారు.