చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో 99 రోజుల ఆరోగ్య మిషన్ ఆరోగ్య వారోత్సవంలో భాగంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో ఎయిడ్స్ అవేర్నెస్ వాకతాన్( రెడ్ వాక్ ) ను అదనపు జిల్లా కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా. బి రాజశ్రీ తో కలిసి జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి గాంధీ చౌక్ మీదుగా తిరిగి జనరల్ హాస్పిటల్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ హెచ్ఐవి పైన అవగాహన ఉన్నప్పుడే దాని బారిన పడకుండా ఉండగలరని, ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బి రాజశ్రీ జిజి హెచ్ లో గల సంపూర్ణ సురక్ష కేంద్రం వద్ద రోగ నిర్ధారణ పరీక్షల క్లినిక్ ను, ట్రాన్స్ జెండర్స్ కోసం రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రం ను మైత్రి క్లినిక్ వద్ద ప్రారంభిం చారు..ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జలగం తిరుపతి రావు,నోడల్ ఆఫీసర్ ఆర్ట్ సెంటర్,జిల్లా టీబీ నియంత్రణ అధికారి డా. దేవి నాగేశ్వరి, డిప్యూటీ డీఎం హెచ్ ఓ డా. అశ్విని, ఎన్.వి.హెచ్.సి.పి డా. వెంకటేష్, డీఈ డా. శ్రావ్య, టీబీ మెడికల్ ఆఫీసర్ డా. అవంతి , ఆర్ట్ సెంటర్ మెడికల్ ఆఫీసర్స్, డీ హెచ్ ఈ ఘనపురం వెంకటేశ్వర్లు, డీపీఎం సుధాకర్ , స్నేహ సొసైటీ సిద్దయ్య , పీఎమ్ఓ రూప , మోయిజ్ ,నవీన్, రవి గౌడ్ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సిబ్బంది, జిల్లా వైద్య శాఖ కార్యాలయం సిబ్బంది , ఆఫీసర్ క్లబ్ సభ్యులు,ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సిబ్బంది, టీబీ కంట్రోల్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు.
