రైతులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ఇటీవల అకాల వర్షంతో నష్టపోయిన ప్రతి రైతును తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని నిజామాబాద్ రూరల్ నియోజవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి తెలిపారు. గురువారం డిచ్ పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో రైతుల పంట పొలాలను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఎవరు కూడా అధైర్యపడొద్దని కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అన్నారు. పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే స్థానిక వ్యవసాయ,విద్యుత్, రెవెన్యూ...