చిత్రం న్యూస్, బేల: విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నంతంగా ఎదగాలని గూడ సర్పంచ్ గోడే అవినాష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం గూడ గ్రామంలోని MPPS పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పుస్తకాలు, పెన్నులను, అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరమాల పుస్తకాలను గురువారం అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గోడే అవినాష్ మాట్లాడుతూ.. విద్యార్థులు చక్కగా చదువు కోవాలని, విద్యతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులకు ప్రోత్సాహం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీరామే నిఖిల్, వార్డు సభ్యులు ఠాక్రే సుమిత్, గవాండే సందీప్, పాఠశాల ఉపాధ్యాయురాలు అనూష, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు గవాండే మీనా, వీ.అనిల్, దశరథ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
