ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో వాకథాన్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాకథాన్‌ను అదనపు కలెక్టర్ రాజేశ్వర్ ప్రారంభించారు. రిమ్స్ ఆసుపత్రి నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు నిర్వహించిన ఈ వాకథాన్‌లో అధికారులు, అంగన్వాడీలు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రసంగించి, ఫుడ్ లైసెన్స్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆహార భద్రత...