Chitram news
Newspaper Banner
Date of Publish : 08 April 2026, 5:04 pm Editor : Chitram news

తండ్రి జన్మదిన వేళ పాఠశాలకు కంప్యూటర్ వితరణ చేసిన కుమారుడు 

చిత్రం న్యూస్, వరంగల్ : తండ్రి పుట్టినరోజును పురస్కరించుకుని సమాజం పట్ల తన బాధ్యతను చాటుకున్నారు బండారి మనోజ్. తన తండ్రి బండారి కృష్ణమూర్తి జన్మదిన సందర్భంగా శివనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం మనోజ్-శ్వేత దంపతులు ఒక కంప్యూటర్‌ను బహూకరించారు.

35వ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి మేరుగు అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మనోజ్ దంపతులు కంప్యూటర్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూస నరేంద్రస్వామికి అందజేశారు. ఈ సందర్భంగా మేరుగు అశోక్ మాట్లాడుతూ.. జన్మదిన వేడుకలను ఇలా అర్థవంతంగా, విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా జరుపుకోవడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీహాన్ వర్ధన్, కలువల రాహుల్, గోదాసి శివ, అంకతి అఖిల్ లతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు తిరుపతి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, దేవరాజ్, అంజయ్య, నరేందర్, రంగాచారి, సంపత్, కవిత, సుహాసిని, స్వప్న, భవాని, కృష్ణమూర్తి, కిరణ్మయి, విద్యార్థులు పాల్గొన్నారు.