విద్యుత్ వెలుగుల్లో రంజని తండా
చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో : నిర్మల్ జిల్లా కుబీర్ మండలం రంజని తండాలో గత 20 ఏళ్లుగా నెలకొన్న విద్యుత్ సమస్యలకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. తండా ప్రజల చిరకాల వాంఛ అయిన విద్యుత్ స్తంభాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. గత రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు విద్యుత్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడ్డారు. యువ నాయకుడు జాదవ్ వికాస్ నాయక్ ప్రత్యేక చొరవ తీసుకుని, అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి...