Chitram news
Newspaper Banner
Date of Publish : 08 April 2026, 4:16 pm Editor : Chitram news

విద్యుత్ వెలుగుల్లో రంజని తండా 

చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో : నిర్మల్ జిల్లా కుబీర్ మండలం రంజని తండాలో గత 20 ఏళ్లుగా నెలకొన్న విద్యుత్ సమస్యలకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. తండా ప్రజల చిరకాల వాంఛ అయిన విద్యుత్ స్తంభాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. గత రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు విద్యుత్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడ్డారు. యువ నాయకుడు జాదవ్ వికాస్ నాయక్ ప్రత్యేక చొరవ తీసుకుని, అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి నిరంతరం ఫాలోఅప్ చేశారు. వికాస్ నాయక్ కృషి ఫలితంగా 2026లో ఈ ప్రాజెక్టుకు అధికారికంగా అనుమతులు (Sanction) లభించాయి. ప్రస్తుతం విద్యుత్ అధికారుల పర్యవేక్షణలో పీఎం జుగ (PM-JUGA) కింద కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు.ఈ సందర్భంగా తండా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. “మా కష్టాలను గుర్తించి, మా కోరికను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది” అని స్థానికులు పేర్కొన్నారు.