చిత్రం న్యూస్, బేల: బేల మండలం అవాల్పూర్ గ్రామ అంగన్‌వాడీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ అనిల్ బుధవారం సందర్శించారు. అక్కడి పరిస్థితులను, కార్యక్రమాలను పరిశీలించారు. కేంద్రంలోని పిల్లల సంఖ్య, వారికి అందిస్తున్న పౌష్టికాహార పంపిణీ విధానం, కేంద్రం యొక్క నిర్వహణ గురించి ఆరా తీశారు. అంగన్‌వాడీ టీచర్, సహాయకురాలితో మాట్లాడి, కేంద్రంలో అమలు జరుగుతున్న ‘ఆరోగ్య లక్ష్మి’ వంటి పథకాలపై వివరాలు తెలుసుకున్నారు. పిల్లల తల్లిదండ్రులను కూడా అడిగి కేంద్రం నిర్వహణపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కేంద్రం పరిశుభ్రత, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు.

