చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండలం కూర గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణానికి బుధవారం భూమి పూజ నిర్వహించారు. 4.50 లక్షల నిధులతో నిర్మాణ పనులను చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బీఆర్ఎస్ నాయకుడు మార్చెట్టి గోవర్ధన్, బీజేపి కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు ఏనుగు రాకేష్ రెడ్డి, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు సామ వెంకట్ రెడ్డి హాజరై, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన కొంగల భూమన్న, సామ సంజీవ్ రెడ్డి, బీమ్ రెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
