-Advertisement-

నిర్మల్ జిల్లాలో గాంజా గస్తీ కార్యక్రమం: యువత అప్రమత్తంగా ఉండాలి 

నిర్మల్ జిల్లాలో గాంజా గస్తీ కార్యక్రమం: యువత అప్రమత్తంగా ఉండాలి

చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో: నిర్మల్ జిల్లాలో గాంజా, మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీస్ శాఖ చేపట్టిన గాంజా గస్తీ కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, జిల్లా ఎస్పీ డా.జి.జానకీ షర్మిల యువతకు కీలక సూచనలు చేశారు.జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న గాంజా గస్తీ కార్యక్రమం ద్వారా ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు గాంజా వాడకం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ మత్తు పదార్థాలు ఆరోగ్యంపై, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఎస్పీ తెలిపారు. యువత గాంజా వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తమ భవిష్యత్తును కాపాడుకోవాలన్నారు. అప్రమత్తంగా ఉండటమే కాకుండా అలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి అధికారులకు సమాచారం అందించాలని ఆమె కోరారు. గాంజా విక్రయం లేదా వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు సంప్రదించవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో మత్తు పదార్థాల ప్రభావాన్ని తగ్గించేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments