-Advertisement-

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇళ్లపై ఏసీబీ దాడులు

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇళ్లపై ఏసీబీ దాడులు

చిత్రం న్యూస్, విజయవాడ:  ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌ కలిగిరి శాంతి నివాసాలు, కార్యాలయాలపై మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. తాడేపల్లి, విజయవాడలలోని శాంతికి చెందిన మూడు ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు, ఆస్తుల వివరాలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. శాంతి మాజీ భర్త మదన్ మోహన్.. ఆమెకు విల్లాలు, ఫ్లాట్లు, కార్లు సహా రూ. 20 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నాయని, విశాఖలో భారీ భూదందాకు పాల్పడ్డారని గతంలో మంత్రి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా అవినీతి నిరోధక శాఖ అధికారులు చేస్తున్న ఆకస్మిక దాడులు కలకలం రేపుతున్నాయి. వైసీపీ హయాంలో శాంతి వ్యవహారం తీవ్ర వివాదాస్పదమై, సస్పెన్షన్‌కు గురయ్యారు. భారీ అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో జరిగిన ఈ తాజా ఏసీబీ దాడులతో కాళింగిరి శాంతి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా మరోసారి కలకలం రేపుతుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments