మిర్యాలగూడ బార్ అసోసియేషన్ ఎన్నికలు: నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
చిత్రం న్యూస్, మిర్యాలగూడ: మిర్యాలగూడ బార్ అసోసియేషన్ 2026-27 సంవత్సరానికి గాను ఎన్నికల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఈ నెల 14న జరగనున్న ఎన్నికలకు మొదటి రోజు పలువురు న్యాయవాదులు అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి, కార్యవర్గ సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు.ఎన్నికల అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, అధ్యక్ష పదవికి సీనియర్ న్యాయవాది గౌరు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పదవికి జంగిలి ఎల్లయ్య, కోశాధికారి పదవికి రెడ్డిపల్లి సైదులు, క్రిడల కార్యదర్శి పదవికి భూక్యా రమేష్,...