భైంసాలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించునున్న జిల్లా ఎస్పీ
చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో: నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జానకీ షర్మిల బుధవారం భైంసా పట్టణంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు, భైంసా క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఈ విషయాన్ని పోలీసు అధికారులు ధృవీకరించారు. జిల్లా ప్రజలు తమకు ఎదురవుతున్న సమస్యలు, పోలీసులకు సంబంధించిన ఫిర్యాదులు, లేదా ఇతర ఏవైనా పోలీసు సంబంధిత విషయాలను ఈ సమయంలో...