Chitram news
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 10:08 pm Editor : Chitram news

భైంసాలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించునున్న జిల్లా ఎస్పీ 

చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో: నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జానకీ షర్మిల బుధవారం భైంసా పట్టణంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు.  ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు, భైంసా క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఈ విషయాన్ని పోలీసు అధికారులు ధృవీకరించారు. జిల్లా ప్రజలు తమకు ఎదురవుతున్న సమస్యలు, పోలీసులకు సంబంధించిన ఫిర్యాదులు, లేదా ఇతర ఏవైనా పోలీసు సంబంధిత విషయాలను ఈ సమయంలో ఎస్పీ దృష్టికి తీసుకురావడానికి అవకాశం కల్పించబడిందన్నారు.ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, తమ సమస్యలను నేరుగా జిల్లా ఎస్పీకి తెలియజేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.