-Advertisement-

థియేటర్‌లో “దూరంధర్ – 2” వీక్షించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు

చిత్రం న్యూస్, హైదరాబాద్: నగరంలోని ప్రముఖ సినీ కేంద్రమైన ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్‌లోని ఓడియన్ థియేటర్లో ‘దూరంధర్ – 2’ చిత్రాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు పార్టీ ముఖ్య నేతలతో కలిసి వీక్షించారు. అనంతరం థియేటర్ ఆవరణలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ గారితో పాటు పార్టీకి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. సినిమా విశేషాలను పంచుకున్నారు.దేశభక్తిని ఎంతో దృఢ విశ్వాసంతో ప్రదర్శించరాని, సినిమా అంతటా ఎన్నో ప్రశంసనీయమైన సన్నివేశాలు, నిజంగా ఎంతో ప్రభావవంతంగా, ఆకట్టుకునేలా ఉన్నాయిన్నారు. ప్రస్తుత పరిణామాలపై నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతం రావు, వీరేందర్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీత రెడ్డి, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి సుభాష్, రాష్ట్ర కోశాధికారి వాసుదేవ రావు పాల్గొన్నారు. వీరితో పాటు ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్, BJYM రాష్ట్ర అధ్యక్షుడు కుండె గణేష్, రాష్ట్ర అధికార ప్రతినిధులు తాడూరి శ్రీనివాస్, రాహుల్, శ్రీనివాస్, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments