Chitram news
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 8:30 pm Editor : Chitram news

డీసీఓ నర్సయ్య కుటుంబానికి అధికారుల ఆర్థిక సాయం 

చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో : జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన డిప్యూటీ కలెక్టర్ కార్యాలయ (డీసీఓ) అధికారి నర్సయ్య కుటుంబానికి మంగళవారం జిల్లా అధికారులు ఆర్థిక సహాయం అందించారు. కలెక్టర్ ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా చెక్కులు, నగదు అందజేశారు. జిల్లా అధికారుల సంఘం తరపున అందించిన ఆర్థిక సహాయాన్ని నర్సయ్య కుటుంబ సభ్యులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, మృతుడి కుటుంబానికి ప్రభుత్వం, అధికారులు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. సీపీవో జీవరత్నం, డీఆర్డీవో జయలక్ష్మి, ఎస్టీఓ సరోజ, డీపీఓ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, పలు సంక్షేమ శాఖల అధికారులు, డీసీఎస్ఓ రాజేందర్, డీఎం ఇండస్ట్రీస్ నరసింహా రెడ్డి తదితరులు ఆర్థిక సహాయం అందించడంలో పాలుపంచుకున్నారు.