-Advertisement-

రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి: ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ఓ డివిజన్ కార్పొరేటర్ రాజకీయ కక్ష సాధింపుతో ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అసోసియేషన్ పై పుకార్లు పుట్టిస్తూ జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ లకి ఫిర్యాదు చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలలో గెలుపొందిన నిజామాబాద్ సౌత్ డివిజన్ల కార్పొరేటర్లకు సన్మానం చేయాలని సదుద్దేశంతో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ భవనము మరమ్మత్తులు జరుగుతుండడం వలన స్థానికంగా ఉన్న వాటర్ ప్లాంట్ లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఇట్టి వాటర్ ప్లాంట్ డాక్టర్ గ్రూప్ వారు 15 సంవత్సరములు అద్దెకు తీసుకున్నారని ఇంకా ఏడు సంవత్సరాల కాల పరిమితి మిగిలి ఉండగా తాము అనుమతితో ఇట్టి సన్మాన కార్యక్రమం నిర్వహించామని, సన్మాన కార్యక్రమంలో  ఆ కార్పొరేటర్ ను కూడా సన్మానించామన్నారు. కానీ తాను రాజకీయ బురద చల్లడం కోసం వాటర్ ప్లాంట్ ను కబ్జా చేసేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మా అసోసియేషన్ లో ఉన్న ఒక సభ్యుడిని బెదిరింపులకు పాల్పడడంతో ఐదవ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం  జరిగిందని తెలిపారు.  మాకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని వారు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నరసింగరావు, కోశాధికారి రమణ గౌడ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments