Chitram news
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 7:00 pm Editor : Chitram news

ఘనంగా EMT డే వేడుకలు

చిత్రం న్యూస్, నిర్మల్ బ్యూరో : నిర్మల్ జిల్లాలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT) డే సందర్భంగా 108 అంబులెన్స్ సిబ్బంది ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లాలో 108 సేవలు అందిస్తున్న ప్రాముఖ్యతను గత సంవత్సరంలో 31,977 కేసులకు సేవలందించిన వివరాలను వెల్లడించారు.

ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT) డేని పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలో 108 అంlబులెన్స్ సిబ్బంది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో EMTలు, పైలట్లు, ఇతర సిబ్బంది పాల్గొని, అత్యవసర వైద్య సేవల్లో తమ పాత్ర గురించి వివరించారు. 108 అంబులెన్స్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటూ, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాదాలు, గుండెపోటు, స్ట్రోక్, గర్భిణీ అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందనను అందిస్తున్నాయన్నారు.

ఈ సేవలు సమాజానికి ప్రాణాధారంగా నిలుస్తున్నాయని సిబ్బంది తెలిపారు. EMTలు సంఘటనా స్థలంలోనే ప్రాథమిక చికిత్స అందించి, రోగిని స్థిరపరిచి ఆసుపత్రికి తరలించడంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు . గోల్డెన్ అవర్‌లో అందించే సేవలు అనేక ప్రాణాలను కాపాడుతున్నాయని వారు పేర్కొన్నారు. గత సంవత్సరంలో నిర్మల్ జిల్లాలో 108 సేవలు 31,977 అత్యవసర కేసులకు సేవలందించాయి. ప్రమాద బాధితులు, గర్భిణులు, గుండె, స్ట్రోక్ రోగులకు అందించిన సేవలు వేలాది మందికి ఉపకరించాయి. ప్రోగ్రామ్ మేనేజర్ శ్రీ N. జనార్ధన్ ఈఎంఈ లింగాచారి మాట్లాడుతూ, EMTలు అంకితభావంతో పనిచేస్తున్నారని, ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో 108 సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.