Chitram news
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 6:52 pm Editor : Chitram news

ఆదిలాబాద్ రిమ్స్‌లో ప్రజా పాలన ప్రగతి వేదిక

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ (RIMS) వైద్య కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి వేదిక’ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, స్థానిక శాసనసభ్యులు పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మున్సిపల్ చైర్మన్ అనూష సతీష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా ఈ వేదికలు దోహదపడతాయని పేర్కొన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, కళాశాల అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. అనంతరం వైద్య విద్యార్థులతో ముచ్చటించి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, ప్రముఖ వైద్యులు, వైద్య కళాశాల విద్యార్థులు, ఇతర విభాగాల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.