చిత్రం న్యూస్, జైనథ్: ఉమ్మడి జైనథ్ మండలంలోని వివిధ గ్రామాల అంగన్‌వాడీ టీచర్లు సోమవారం ఘనంగా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు. నిరాల గ్రామంలోని స్థానిక త్రినేత్ర గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో టీచర్లందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
సమ్మేళనంలో భాగంగా అంగన్‌వాడీ టీచర్లు ఒకరికొకరు గాజులు తొడిగి, చేతులకు మెహందీ పెట్టుకుంటూ సందడి చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సీడీపీఓ (CDPO) సురేఖ హాజరుకాగా, నిరాల గ్రామ సర్పంచ్ చౌదరి సునంద ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వృత్తిపరమైన ఒత్తిడిని పక్కన పెట్టి, టీచర్లందరూ ఇలా కలిసి సమయాన్ని గడపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు నరసమ్మ, సునంద, భూమబాయి, భారతీ, సుజాత, రేవతి, నాగుబాయి, పద్మ, జయమల , వసంత, స్వప్న, పొచ్చక్క, మనిమల, ప్రవీణ, దేవత, సింధు, రజిత, మమత తదితరులు పాల్గొన్నారు.


