Chitram news
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 3:20 pm Editor : Chitram news

బాసర అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లాలోని దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన క్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి దేవి దేవస్థానం, ఆలయ చుట్టుపక్కల అభివృద్ధి పనులకు  రూ.225 కోట్లతో చేపట్టనున్న నిర్మాణ పనులకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.

దేవాలయ ప్రాంగణం 20 వేల చదరపు అడుగుల నుంచి 60 వేల చదరపు అడుగుల వరకు పెరగనుంది. అమ్మవారి ఆలయంలో తొమ్మిది అంత‌స్థుల రాజ‌గోపురం, ఈశాన్యంలో కోనేరు నిర్మాణం చేయ‌నున్నారు. మూడు రెట్లు పెర‌గ‌నున్న బాస‌ర దేవాల‌య విస్తీర్ణం శృంగేరి పీఠాధిపతుల అనుమ‌తితో ఆల‌య అభివృద్ధి ప‌నులు ప్రారంభించారు. ఇప్ప‌టికే బాస‌ర ఆల‌య మాస్ట‌ర్ ప్లాన్ రూప‌క‌ల్ప‌న చేశారు. ప్ర‌స్తుతం 2వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో గ‌ర్భాల‌యం ఉందని, నాలుగు దిక్కుల్లో మాడ వీధుల్ని నిర్మించనున్నారు. సీఎం రాకతో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ డా. జానకీ షర్మిల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి,  ఆదిలాబాద్ ఎంపీ నగేష్, నిర్మల్, ముథోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి రామారావు పటేల్, వెడ్మ బొజ్జు, రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ హన్మంత్ రావు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తదితరులు పాల్గొన్నారు.