చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రాష్ట్ర వయోజన విద్యాశాఖ డైరెక్టర్ గా నియమితులైన ఏనుగు శ్రీనివాస్ రెడ్డిని ఇచ్చోడ, గ్రామస్తులు, నేతలు ఘనంగా సన్మానించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఆయన స్వగృహనికి వెళ్లిన నేతలు పుష్పగుచ్ఛం అందజేసి శాలువా కప్పి సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు. డీసీసీబీ మాజీ చైర్మన్ ఏనుగు మోహన్ రెడ్డి ఇచ్చోడ రెడ్డి సంఘం అధ్యక్షులు ఏనుగు మోహన్ రెడ్డి, హనుమాన్ సాయి టెంపుల్ చైర్మన్ గూడూరు ముత్యంరెడ్డి,నాయకులు తుమ్మల రాజేశ్వర్ రెడ్డి, ఏనుగు విశ్వనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
