దీపాయిగూడలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం: జెండా ఆవిష్కరించిన లోక కరుణాకర్ రెడ్డి
చిత్రం న్యూస్, జైనథ్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జైనథ్ మండలంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం మండలంలోని దీపాయిగూడ గ్రామంలో బీజేపీ జైనథ్ మండల అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి తన స్వగ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ అవతరించడం వెనుక లక్షలాది మంది కార్యకర్తల త్యాగాలు ఉన్నాయని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి...