-Advertisement-

అనంతపురంలో ఘనంగా ‘దీన్ దయాల్ ఉపాధ్యాయ’ ప్రశిక్షణ శిబిరం

చిత్రం న్యూస్, అనంతపురం: అనంతపురం జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాప్తాడు రూరల్, రాప్తాడు, ఆత్మకూరు మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ‘దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరం’ అట్టహాసంగా జరిగింది. ఈ శిబిరానికి ముఖ్య వక్తలుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు, బీజేపీ సీనియర్ నాయకురాలు  ఎఫ్.సి.ఐ (FCI) స్టేట్ డైరెక్టర్ వనగొంది విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ‘మన్ కీ బాత్’ (మనసులో మాట), ‘మన ఊరు-మన జెండా’, ‘చేరువ’ వంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. భారతీయ జనతా పార్టీ నిర్దేశించిన లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు ‘వారధి’లా పనిచేయాలని పిలుపునిచ్చారు. మరో వక్తగా బీజేపీ సీనియర్ నాయకులు ఓలేటి రత్నమయ్య, జిల్లా కార్యదర్శి చైతన్య కిషోర్ పాల్గొని పార్టీ సిద్ధాంతాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు రూరల్ మండల అధ్యక్షులు ప్రదీప్, ప్రధాన కార్యదర్శి వెంకటరాముడు, రాప్తాడు ఆత్మకూరు మండల అధ్యక్షులు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments