-Advertisement-

మాసాయిపేట మండలంలో పలువురు బీజేపీలో చేరిక

చిత్రం న్యూస్,మాసాయిపేట: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో కీలక రాజకీయ మార్పు చోటుచేసుకుంది. మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు సమక్షంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు కీలక నాయకులు, కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరారు.

మాసాయిపేట మండల కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షులు మొలుగు నాగేందర్ రెడ్డి, ఓబీసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. డాక్టర్ వంటేరు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు పరశురామ్ చారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన రామంతాపూర్ తండా సర్పంచ్ చందర్ నాయక్ తో పాటు కార్యకర్తలు బానోత్ రాజు, బానోత్ నర్సిములు, జానీ నాయక్, కేతావత్ రమణ నాయక్ తదితరులకు ఎంపీ రఘునందన్ రావు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. దేశాభివృద్ధి, ప్రధాని మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి భారీగా నేతలు బీజేపీలో చేరుతున్నారని అన్నారు. కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు పాప్పన్నగారి శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ నవీన్ యాదవ్, బూత్ అధ్యక్షులు పల్లపు సురేష్, మల్లాపురం సాయి, పల్లపు అశోక్, కేతావత్ శ్రీను నాయక్, పార్టీ కార్యకర్త తుడుం సాయిలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments