చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో :నిజామాబాద్ నగరంలోని 19వ డివిజన్ కంటేశ్వర్ సీఎస్ఐ చర్చిలో ఆదివారం ఈస్టర్ పండగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చర్చి పాస్టర్, జీడీసీసీ ఛైర్మన్ సీఎచ్. జార్జ్ పాల్గొని యేసు క్రీస్తు యొక్క వాగ్దానాలు భక్తులకు తెలుపుతూ ఈస్టర్ పండగను వివరించారు. క్రైస్తవులు యేసుక్రీస్తు పునరుత్థానానికి(మరణం నుంచి తిరిగి లేవడం) ప్రతీకగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గుడ్ ఫ్రైడే నుంచి ఈస్టర్ ఆదివారం వరకు ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాసాలు, సేవా కార్యక్రమాలతో ఈ పండగను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే సమాధుల వద్ద కొవ్వొత్తులతో ప్రార్థనలు, చర్చిలలో ప్రత్యేక ఆరాధనలు, కుటుంబ సమేతంగా ఆనందాన్ని పంచుకుంటారు. ఈస్టర్ వేడుకల్లో గ్రామ ప్రజలు, పిల్లలు,పెద్దలు,సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
