అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : జిల్లాలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు తమ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎవరు అధైర్యపడొద్దని నిజామాబాద్ రూరల్ నియోజవర్గ శాసనసభ్యులు డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. అకాల వర్షం కారణంగా సంభవించిన నష్టనివారణ తక్షణ చర్యల నిమిత్తం ఇప్పటికే రెవెన్యూ,విద్యుత్, వ్యవసాయ శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి పలు ఆదేశాలు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో అకాల వర్షం,గాలివాన...