* మున్సిపల్ ఛైర్ పర్సన్ గా అంకం మౌనిక, వైస్ చైర్మన్ గా మహమ్మద్ సోయబ్ హుస్సేన్
చిత్రం న్యూస్, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా అంకం మౌనిక, వైస్ చైర్మన్ గా మహమ్మద్ సోయబ్ హుస్సేన్ లు ఎన్నికయ్యారు. కౌన్సిలర్లు.. చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ కు చెందిన ఏడుగురు కౌన్సిల్లర్లు తమ చేతులు ఎత్తి మద్దతు తెలిపారు. ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఓటు వేశారు. ఎన్నిక అనంతరం చైర్ పర్సన్ గా అంకం మౌనిక, వైస్ చైర్మన్ గా మహమ్మద్ సోయా హుస్సేన్ లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అధికారులు వారికి ధ్రువీకరణ పత్రాలు అందించారు. పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మెన్ ఎన్నిక సందర్భంగా బందోబస్తు ను జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీ ఉపేంద్రరెడ్డి లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, జిల్లా అదన కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ప్రత్యేక అధికారి (సిపిఓ) జీవరత్నం, ఆర్డీవో రత్నకళ్యాణి, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, తహసిల్దార్ సుజాత, ఎంపీడీవో రమాకాంత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
