చిత్రం న్యూస్, జైనూర్,: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని జెండగూడ గ్రామానికి చెందిన మహిళ సవిత 108లో ఆదివారం ప్రసవించినట్లు 108 దత్తాత్రేయ, పైలట్ మడావి బాపురావు తెలిపారు. గర్భిణి సవితకు పురిటినొప్పులతో బాధ పడుతున్న గర్భిణికి ఉట్నూర్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయగా మహిళా కడుపులో బిడ్డ మోషన్స్ చేస్తుందని కాన్పు కష్టమవుతుందని వైద్య అధికారుల సూచన మేరకు 108లో ఆదిలాబాద్ రిమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో సీతగొంది సమీపంలో నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్ ఈఎంటీ దత్తాత్రేయ అంబులెన్సు రోడ్డు పక్కన నిలిపారని, సవిత మగ బిడ్డకు జన్మనిచ్చిందన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించామని ఈఎంటీ దత్తాత్రేయ, పైలట్ మడావి బాపూరావులు తెలిపారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు.


