ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: భారత మాజీ ఉపప్రదాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కంటేశ్వర్ కమాన్ వద్ద గల పాత అంబేడ్కర్ భవన్ లో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ ఆకుల ఉమారాణి, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ...