బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సీపీఐ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 10 గంటలకు భుక్తాపూర్‌లోని 49వ వార్డులో 'ఇంటింటికి సీపీఐ ' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ, రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తెచ్చి పెత్తందారుల పక్షాన నిలుస్తోందని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు...