ప్రభుత్వ విప్ విజయరమణారావుకు ఆదిలాబాద్లో ఘన స్వాగతం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో సోమవారం చేపట్టనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విచ్చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయరమణారావుకు ఆదిలాబాద్లో ఘన స్వాగతం లభించింది. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా విజయ రమణా రావును కంది శ్రీనివాస రెడ్డి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు....